ట్యాగులు


 ‘యికముడిఎరుగనిబతుకు’ కధలోఒకఆడబతుకుఉంది. దానిలోఅగాధమైనదుఃఖంఉంది. ఆదుఃఖానికిరమేశుభాష్యంఉంది. ఆభాష్యంఅతనికరిగినగుండెనుండి  స్రవించినజీవధార. అందులోకొన్నిసంవత్సరాలవెనుకదాదాపుప్రతిఇంట్లోబోడితలలతోనూ, తుంటిదోపుతోనూకనబడి; ఆఇంటిసుఖశాంతులకు, సౌకర్యాలకుపనిముట్లుగామారిన ‘మొగుడుచచ్చిన’ ఆడోళ్ళఅలిఖతవేదనఉంది. వాళ్ళకూడూ, గుడ్డేకాదు;  జ్ఞానం, దేహంకూడనిరాకరించిన  క్రూరత్వంనుండేచలంప్రవక్తగాపుట్టాడు. ఇప్పుడురమేశుఅదేబాటపట్టాడు.
ఎనిమిదోఏటనేభర్తనుపోగొట్టుకొనివిధవరాలైనకన్నెమ్మను, పూజలు (డిజైన్) లేనికారికంగుడ్డతోకుట్టించినరెండుపావళ్లు, రెండురయికలతోచుట్టింటికి(వంటిల్లు) పరిమితంచేసారు. “తొలిముట్టుకుమూడునెలలముందుకన్నతల్లినిపోగొట్టుకొనింది. మారుతల్లిఆఇంటికివస్తానేకన్నెమ్మచేతఎర్రకోకనుకట్టించి, రయికనువిప్పించింది. అప్పుడుఎడమయిపొయినరయికమరలాఆయమ్మఒంటినితాకనేలేదు. పాముపడగనీడలోకప్పబతికినట్టుబతికిందిమారుతల్లిఒడిలోకన్నెమ్మ. కూచుంటేతప్పు, నిలబడితేతప్పు, నోటినిండానవ్వితేతప్పు, గొంతెత్తిమాట్లాడితేతప్పు, కడుపుకుకావలసిందిఅంతతింటేతప్పు, కన్నారాకునికితేతప్పు.”
అలాంటికన్నెమ్మనునిండుయవ్వనంలోమడేలుమురుగుడువలచాడు. కన్నెమ్మబతుకులోవసంతంవచ్చింది. “మర్రిమానుకిందఆగబ్బుచీకటిలోమురుగడిపక్కనచేరిఒళ్లంతావెలుగునునింపుకొనేదికన్నెమ్మ.” మురుగుడుతెచ్చినజిలేబినీఒకరికొకరుతినిపించుకొంటుండగావెనుకనుండిగొడ్డలితోపొడిచి  అతనిప్రాణంతీసాడుతమ్ముడురాజిరెడ్డి. ఏమీఎరగనట్లుభార్యతో, కన్నెమ్మతోఅత్తారింటికిచేరాడు. ఆరోజునుండికడదాక, కన్నెమ్మబతుకుపొంతకడవబతుకయ్యివదినెపుట్టింటికిఊడిగంచేయటంలోనేగడిచిపోయింది. “అయిదుబారలఎర్రప్రసనుకోకనుతుంటిదోపు (మొగుడుచనిపోయినవాళ్లుకుచ్చిళ్లుపోయకుండాకట్టేకట్టు) కట్టుకొని, ఇంకొకకోకనుచుట్టిచంకలోపెట్టుకొనివాళ్లవెనకాలనేకన్నెమ్మకూడాఈఇల్లుకడపతొక్కింది”
ఎవరీకన్నెమ్మ?
“కన్నెవ్వమామేనత్తఆడబడుచు. ఆఇంట్లోపనిచేయడంతప్పఎవరితోమాట్లాడటంనేనుచూడలేదు, నాబాల్యంలో. ఎవరూలేనప్పుడునన్నుదగ్గరకులాక్కొనిముద్దులుపెట్టుకొనేది.” అప్పుడుఆమెకంట్లోతడికిసమాధానంస.వెం. రమేశుకుఆమెఎత్తుబడి (కర్మకాండలు) తరువాత  తల్లినుండితెలిసింది.
ఈకధకాలంయాబ్భైఅరవైయేళ్ళక్రితమయిఉండాలి. తెలుగుదేశానఉత్తరాదినపుట్టినచలందక్షిణానఉన్నచదువురానికన్నెమ్మనుచేరలేదు. మడేలుమురగడితోఆమెఅనుభవానికి  చాలామూల్యంచెల్లించింది. ఈదేశంలోపెళ్ళైభార్యలుఉన్నఅన్నివయసులమగవాళ్ళుకూడాయధేచ్చగా, సునాయాసంగాకొనుక్కోగల, క్రీడించగలఅతిచౌకైనాశృంగారం; యవ్వనంలోఉన్నవితంతువుకన్నెమ్మకునిషేధం. సహజాతిసహజమైనఆమెమేనిదాహం, ఆమెఅనాధమనసుకోరినస్నేహంతనప్రియప్రాణాన్నిబలిగొనిఆమెనుకడదాకజీవన్మృతురాల్నిచేసింది.
ఇలాంటిఇతివృత్తంతోకధలుకొన్నివేలువచ్చిఉంటాయి. ఇకసినిమాలుచెప్పనక్కరలేదు. అందులోచాలావరకుమనకుసంబంధంలేనిలోకాల్లో,  పరాయివ్యక్తులగురించివిన్నట్లు, చూసినట్లుఉంటుంది. కానిరమేశుకధనడకఅసాధారణంగాఉంటుంది. ఒకమగరచయితస్త్రీపాత్రనుసృష్టించినపుడు; ఆమెఅంతరంగఆవిష్కరణ, కృతిమత్వంలేకుండా, బండతనంలేకుండామాటలకందించటంకత్తిమీదసామే. అందుకోసంఆడవాళ్ళవగపుపట్లదయ, ఔదార్యంఉంటేసరిపోదు. వాళ్ళహృదయపులోతులనుసృజించగలగాలి. వాళ్ళగుండెచప్పుళ్ళువినగలగాలి. వాళ్ళమనసుసంవేదనలనుభ్రాంతులు, భ్రమలుఅంటించకుండానికార్సుగామనపరంచేయగలగాలి. ఆపనిరమేశుఅత్యధ్భుతంగాచేసికూర్చున్నాడుఈకధలో.
ప్రకృతిలోనిఅన్నిజీవరాశులసృష్టికార్యాలనుఅంగీకరించేమనుషులచేత; ఒకస్త్రీమోహాన్ని, వాంఛనీఅంతేసహజంగాఆమోదింపచేయటంసులభమైనపనికాదు. అందుకేమనుషులుఅందుకోలేనీ, అందుకొన్నాఅంగీకరించినఆడదానిదేహకాంక్షలనుమట్టితోచెప్పించాడురమేశు. “ఎవరికీపట్టనట్టు, ఊరంతాకలిసివెలేసినట్టుఆమూలనపడిఉండేనాదగ్గరకుపోతయ్యవచ్చి, నన్నుతాకిచూసినాడు. ఎన్నోనాళ్లతరువాతఒకమగోడిచెయ్యితగిలేసరికిఎంతనెమ్మదిపడినానో. నీకునేనుఉండానులేతొప్పర (బాధ) పడవద్దుఅన్నట్టునన్నునిమిరినాడు. రెండుచేతులనిండుగానన్నుజవురుకొనిజల్లలోపండుకోవెట్టి, ఇంటికితీసుకొనివచ్చినాడు. ఈకానగమానుకిందచోటుచూపించినాడు. ఈపొద్దోరేపోనాకొకకొత్తబతుకునుఇవ్వపోతాఉండాడు.”  అనినల్లమట్టికుమ్మరిపోతయ్యస్పర్శకుపులకరించిపోతూచెబుతుంది. “ఎవరుఏమన్నాఅనుకోండి, ఈమాటనుచెప్పేతీరాల. కుమ్మరోడికిందతొక్కుడుపడినచేరుమన్నుబతుకేబతుకు. ఆఇమ్ము (సుఖం) చవికొన్నవాళ్లకేతెలుస్తాది. కొవ్వినపుంజుకోడికొప్పరించిమిందకువస్తేఒదిగితోవచూపిస్తాదేపెట్టకోడి, అట్టమెదిగిపోయినానుపోతయ్యకాళ్లకిందనేను.”
వస్తువులుతమనుమనుషులుగావ్యక్తీకరించుకోవటంఈకధకుగలప్రత్యేకత. కధజరుగుతున్నస్థలంలో, కాలంలోతనులేనిలోటునుపూడ్చటానికి, రచయితఅక్కడవున్నగృహపరికరాలద్వారకధనుచెప్పించాడు. కడుపులోదాచుకొన్నక్షోభని, బ్రతుకంతానోరువిప్పిచెప్పనికన్నెమ్మకధనుచెప్పుకొన్నది  పొంతకడవ, ఎత్తుబొట్ట, దొంతిగుడవ,బియ్యంజల్లెడ, చింకిచాప, రాగిచెరవ, అంబటిబాన, ఊదరబుర్ర, తూకువెళుకు (తూర్పువెలుగు). “ఇంకాసాకలిసొలుపుతీరలేదా” అనేదెప్పిపొడుపుమాటవెనుకఅంతరార్ధంఅంచలంచలుగాచెప్పుకొన్నాయిఈవస్తువులు. మధ్యలో ‘అయ్యోకూతురా, మడేలుకుఒళ్లుఅప్పగించేసిందాకన్నెమ్మ’ అన్నఊదరబుర్రనుతీవ్రంగామందలించాయి. ‘ఒసేముయ్యే. మనుసులునిన్నుఊదిఊది, వాళ్లలోపలికువ్వాళంఅంతానీలోచేరిపొయినట్టుఉండాది.’ అనిఎకసెక్కంచేసాయి. ఆమెదుఃఖాన్నీతమసొంతంగాభావించివలవలాఏడ్చాయి. పొంతకడవమాత్రంఆమెకధవిన్నతరువాతతల్లడిల్లిపోయింది. ‘పగలుపొద్దుగూకులూకాగికాగికాలిపోయేనాకు, కడకుమిగిలేదిమసేకదా. పండగపూటకూడాపొంతకడవకుఅంతపసుపూకుంకుమాపెట్టరే. ఇంటిల్లిపాదికీఇంతఊడిగంచేసేనన్ను, కడానఉలవరించుకొనిపొయిననాడుదిబ్బలోనేకదావేసేది. ఓటిమంగలానికిఉండేమతింపుకూడాపొంతకడవకుఉండదే.. నాబతుకుమాదిరబతుకేకదాఆయమ్మదికూడా.’ అనితలపోసివగచింది.
మేనల్లుడుకూడ ‘సాకలిసొలుపుతీరితేకదా’ అనగానేదినమంతాకూడూనీళ్ళుముట్టకుండాఅర్ధరాత్రిపుట్టినింటినుండితెచ్చుకొన్నరాగిచెరవనుకావలించుకొనిపొగిలిపొగిలిఏడుస్తుందికన్నెమ్మ. ఆఏడుపునుచూసిన  పొంతకడవతనుకూడఎక్కిళ్ళుపెట్టిఏడ్చిచుక్కపుట్టేపొద్దుకుపగిలిపోతుంది.
‘ఓస్ఆడోళ్ళుచేసేఎలాంటిపనైనామేముచేసేయగలం’ అనేఅహంకారంఎంతఅమానుషమో, ‘ఆడదిఎంతపనైనాతనకుటుంబంకోసమేకదాచేసేది’ అంటూదాన్నిసహజసూత్రంగాస్వీకరించటంకూడాఅంతేఅన్యాయం. స్త్రీశ్రమనిఉపరితలంనుండిచూడటం, తేలికచేయటంఇక్కడేమొదలౌతుంది. ప్రతిపనిమరనొక్కిచేసేరోజులుకావవి. నడుమునువిల్లులావంచాలి, భుజకండరాలనుపూర్తిస్థాయిలోఉపయోగపెట్టాలి. చేతులు, కాళ్ళునిరంతరంశ్రమించాలి. పొద్దుపొడిచిందిమొదలు, ఊరుగురకలుపెట్టేవరకుఎడతెరిపిలేని, సృజనాత్మకతలేనివెట్టిచాకిరిఅది.  ‘దేవత, అనురాగమయి, త్యాగమయి’ పిలుపులుమాత్రమే (అదీపొదుపుగా) భత్యంగావచ్చేదగాకోరుదోపిడి. (కన్నెమ్మకుఆజీతం, భాగ్యంకూడలేవనుకోండి). రచయితచుట్టింట్లోపీటవేసుకొనిదినమంతాకూర్చొన్నాకూడఆశ్రమనుఅంతసజీవంగాఅక్షరాల్లోపెట్టటంఅసాధ్యం. ఒకరోజులోఒకస్త్రీచేసేకష్టాన్నిరచయితతనుకూడచేసిఉంటేనేఅలారాయగలడుఅన్పిస్తుందిఆవర్ణనచదివితే. ఆభాగంమాత్రంమీరుచదవాల్సిందే.
ఇకరచయితభాషా, వస్తుపరిజ్ఞానంఅపరిమితం. గతంలోవిరివిగావాడి, ఇప్పుడుసాహిత్యంలోను, మ్యూజియంలోనూమాత్రమేకనిపిస్తున్నగ్రామీణశ్రమలను, వస్తుసంపదనుఆయనమనకళ్ళకుకట్టించాడు. ముఖ్యంగాకుమ్మరికుండలుచేసినచేసేవైనంమనముందుసాక్షాత్కరింపచేసాడు.
“మరునాడుతెల్లవారిలేచిమబ్బు (తొక్కిపెట్టినమట్టిముద్ద) పక్కనేసారెనుపెట్టి, సారెనుగిరగిరతిప్పుతాదానిమీదనన్నుపెట్టిచేతిఒడుపునుచూపించినాడు. ఆఒడుపుకుపులకరించిపొయిననాఒళ్ళుతీరుతీరునసాగింది. నేనుపంతెనుఅయినాను, పటువనుఅయినాను, పాలడ, పాలిక, మూకుడు, జల్లిమూకుడు, చట్టి, అటిక, రాళ్లటిక, గండివార్పుఅటిక, బుడిగ, గిడిగ, పిడత, ముంత, దుత్త, పంటి, చల్లపంటి, సవకపంటి, కడవ, కలికడవ, పొంతకడవ, బాన, చాకలిబాన, లోవ, గుడువ, బొట్ట, తొట్టి, మంగలము,పంటసాల, గుమ్మి, కులిమి, గాదె, గోలెము…ఒకతీరుకాదుఒకతెన్నుకాదు, వాడుచేతిలోఏమిమరులమందుపెట్టుకొనినన్నుముట్టుకొన్నాడో, నేనుఇన్నిపెడలుగాపొడలుకట్టినాను.” ఇవిమట్టిచేతరచయితపలికించినపలుకులు.
నెళవు (పరిచయం), పసను (రంగు), రెయ్యికోళ్ళు(కీచురాళ్ళు), ఇర్లనాటికోవెల్లనాటికో (అమావాస్యకోపౌర్ణమికో), కడంగి (ప్రయత్నించి), ఉల్లము (మనసు) లాంటిఅచ్చతెలుగుపదాలుపాఠకులనుఉర్రూతలూగిస్తాయి.
ఈకధనుస్మరించుకొంటున్నసందర్భంలోకధగురించికొందరిఅభిప్రాయాలుకూడఉటంకిస్తేబాగుంటుందనిపించింది.
“వినిపించేగొంతులవెనకతలుపులుతెరవనిహృదయాలు,కనిపించేచిత్రంచాటునమూసుకుపోయినకళ్ళనిచూసినమ్మకాలదారపుపోగులుతెగిపోతున్నసమయంలో, తానునమ్మినదాన్నిశ్వాసించి, జీర్ణించి, అనుభవించివ్యక్తీకరించేకృషిచేస్తున్నాడురమేష్. పిచుకలకధలుతోనో, రయికముడిఎరుగనిబ్రతుకులవ్యధలనోతనగొంతుకతోవినిపించాడు.కొత్తవడ్లతోచేసినమొలకబియ్యంసారంఅనుభవిస్తున్నతఆనందంవుందిరమేశ్కథలలో.” రమేశ్కధలగురించిఒకపాఠకురాలుహరితఅభిప్రాయం.
“ఒకమనిషినిమరొకమనిషిచెప్పుచేతల్లోపెట్టుకోడానికిఆమనిషిలోఒకలోపాన్నివెతికిదాన్నితురుఫుముక్కలావాడుకునిఆమెనిఆఒక్కమాటతోకుప్పకూలేలాచెయ్యడంఅనేరాజకీయంఎంతకాలంగానోనడుస్తూనేవుంది . మానవజీవితావసరమైనఒకానొకసుఖాన్నిఒకలిప్తకాలంఅనుభవించడంనేరంఅయిపోయినఅస్వతంత్రకన్నెమ్మఅనగాఎంత? ఏడ్చిఏడ్చిపొంతకుండపగిలిపోయింది .కన్నెమ్మఇంకాఎంతకాలంఅట్లాకన్నీళ్ళుఇగరబెట్టుకుంటూబ్రతకాలి? జీవితం, తిండి ,వస్తువులు.అన్నిటాస్థానీయతతొణికిసలాడేకథ. ‘రవికముడిఎరగనిబ్రతుకు’అక్షరాలనుదృశ్యాలుగామలిచేచిత్రకారుడురమేష్ .పాఠకులనితనపాత్రల్లోకిపరకాయప్రవేశంచేయించేమాంత్రికుడు.అచ్చతెలుగుఅతనిస్వంతం.” -సత్యవతిపి. (రచయిత్రి)
“అదిఒకకన్నీటిగాధ.’రయికముడిఎరుగనిబ్రతుకులు’ లోనాచిన్నప్పటిమహనీయస్త్రీమూర్తులుఎందరోనామనసులోమెదిలాడారు.వేకువనేలేచిగబగబఅన్నంవండి, పొద్దున్నేపిల్లలకింతపెట్టితానింతటిపినులోపెట్టుకొనిపొలంకూలీకిపరుగులుతీసినఅమ్మ,గర్భాశయకేన్సర్తోనేఇంటిల్లిపాదికీవండివార్చిచాకిరీచేసినఅమ్మమ్మ,తలజడవేసుకోటంమాని, ముడితోనేదూదిఉన్నినేకితనవాళ్ళకడుపులునింపిననాయనమ్మ,ఎన్ననిచెప్పేదిఎందరినితలుచుకునేది?ఆదృశ్యాలెన్నోరమేశ్మనకళ్ళకుకట్టాడు.”- నూర్భాషారహంతుల్లా(డిప్యూటికలెక్టర్, విజయవాడ).
మట్టినితవ్వితేమాణిక్యాలుదొరుకుతాయి. పల్లెటూర్లలోనులకమంచాల్లోముడుచుకొనిఉన్నముసలమ్మలనుకదిలిస్తేనాణ్యమైన  జీవితాలులభిస్తాయి. ఎటొచ్చివినదగ్గవారేవినాలి.రాయదగ్గవారేరాయాలి. మరుగునపడ్డ, మసిగుడ్డలుగామారినమహోన్నతస్త్రీమూర్తులచీకటిగాధలను, ధవళహృదయాలనుసమస్తలోకానికిఎరికపర్చవారమేశు! నీసత్యమైనతీక్షణదృష్టితో,నీకధనాకౌశలంతో, నీవిశిష్టభాషాపరిజ్ఞానంతో!

వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు