ట్యాగులు

suffocation

 

ఉక్కపోత ,ఉక్కపోత!

మంచుకొండల్లో ఉక్కపోత

ముసిరే చలిలోనూ ఉక్కపోత

శీతల పవనాలలో, సంధ్యా వ్యాహాళిలో

ఎ.సి గదిలో, నేస్తాల సావాసంలో

అంతటా వినిపిస్తున్న ఒక ఒంటరి ఉద్రిక్త గానం ఉక్కపోత

నా సమస్త కదలికలను శాసిస్తూ

నా సమస్త రాతల్ని నిర్దేశిస్తూ

నా పాటను, మాటను, నా నవ్వుని

నన్నంతా ఒక రహస్య నేత్రమేదో నిరంతరం పరికిస్తున్న ఉక్కపోత

నా ఆహార్యం, అలంకరణ, నా ఆలోచన

నా చేతి లోని పుస్తకం

అన్నింటిని ఆరా తీస్తున్న ఒక ఉక్కపోత

పొరలు పొరలుగా హృదయాన్నంతా గాలిస్తూ

ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించాలని తలపోస్తున్న ఉక్కపోత

ఈ ఉక్కపోతను ముద్దుగా ప్రేమ అని పిలుస్తావు కదూ!

కేర్ అంటారన్నావు కదూ!

కాదులే!

అది ప్రేమ పేరుతో నువ్వు పెడుతున్న నిఘా!

నా మనఃశరీరాలపై నువ్వు చేయబోతున్న కబ్జా!