ట్యాగులు

old building

 

పాత పాట

పాడుపడ్డ కోట

ఇప్పుడు పసందౌతున్నాయి.

పాత పంట

అమ్మ చేతి వంట

చవులూరిస్తున్నాయి.

పాత రంగు

వెలిసిపోయిన చెంగు

ప్రీతి పాత్రమౌతున్నాయి

పాత వాసన

నెరిపిన సంభాషణ

మళ్ళీ పరిమళిస్తున్నాయి.

పాత పుస్తకం

గిల్లిన జ్ఞాపకం

ఎద లోతులను తాకుతున్నాయి.

పాత లోకం

ఆత్మావలోకనం

అమృతప్రాయమవుతున్నాయి.

పాత బాస

ఎంచుకొన్న బాట

పిలిచి నన్ను నిలదీస్తున్నాయి.

పాత దివ్వె

మలుగుతున్న రవ్వ

అలసి చేయూత నడుగుతున్నాయి

పాత యుద్ధం

ఎలుగెత్తిన స్వరం

పదునెక్కి పిలుస్తున్నాయి.

పాతదనమంతా హఠాత్తుగా

నన్నుకౌగిలించి

నులి ముద్దులు బహుకరించింది.

తను నిప్పుల వానే అయినా

తనే ఔషధమయి

కాలిన నొప్పిని మానిపింది.

పాత కాలం అంచుల చీర

ఇప్పుడు చుట్టుకోడానికీ

తీరిక దొరికింది.