ట్యాగులు

ఈ గోదావరి నది వంపు సొంపుల అందగత్తె మాత్రమే కాదు.  జవజవలాడే సారాన్ని అణువణువునా రంగరించుకొన్న జీవగర్ర.  ఈ కొండలు నునుపు తేలి నిటారుగా నిలబడ్డ సౌందర్య రూపాలు మాత్రమే కాదు.   వందల సంవత్సరాలుగా తమలో పాతేసుకొన్నవృక్షాలద్వారా  ఆమ్లజనిని వ్యాపింపచేస్తున్నప్రాణధాతలు. తమ పొరల పొరలలో అరుదైన ఖనిజాలను మోస్తున్న విలువైన వనరులు. వేల ప్రాణులకు  ఆశ్రయం కల్పిస్తున్న విహారాలు. అంతులేని జీవవైవిధ్యాన్ని సంతరించుకొన్నఅపురూపమైన జీవరాసులు.

నదులు ప్రవహించాలి. పర్వతాలు స్థిరపడాలి. ఇది ప్రకృతి సూత్రం. పెద్ద ఎత్తున నదులను స్థిరీకరిస్తే, కొండలను పెళ్ళగిస్తే జరగబోయేది విధ్వంసం. ఆశబోతులైన, స్వార్ధపరులైన మనుషులు చేయబోతున్నపెను తప్పిదానికి భారీ మూల్యం జనమంతా చెల్లించబోతున్నారు.

 ఇంకా సమయం ఉంది.  సాహితీవేత్తలారా కలం విదిలించండి.  కళాకారులారా గళం సవరించండి.  ఉద్యమకారులారా కదం తొక్కండి.  పౌరులారా గొంతు విప్పండి. పోలవరం ప్రాజెక్టును ఆపండి.

 

IMG_9513
      IMG_9517

IMG_9534

IMG_9554

IMG_9570

IMG_9572

IMG_9574

IMG_9576

IMG_9580

IMG_9583

IMG_9584