ట్యాగులు

arundhati-roy(అరుంధతీ రాయ్ రాసిన కాప్టిలిజం అనే పుస్తకం నుండి స్త్రీవాద ఉద్యమానికి  సంబంధించిన ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉందని అనువాదం చేశాను)

తొంభై వేల మహిళలు సభ్యులుగా ఉన్న క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటనకు (ఈ సంస్థ దండకారణ్యంలో తన జాతిలోని పురుషాధిక్యతకు, వారిని వెలుపలకి తరుముతున్న మైనింగ్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.) భారత దేశంలోని అధికార స్త్రీవాదులు మరియు మహిళా సంఘాలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి? లక్షలాది మహిళలు వారి స్వంత లేక ఆధారపడి జీవిస్తున్న భూముల నుండి తొలగింపు ఒక స్త్రీ వాద సమస్యగా ఎందుకు చూడటం లేదు? సామ్రాజ్యవాద వ్యతిరేక, పెట్టుబడి వ్యతిరేక ఉద్యమాల నుండి ఈ ఉదార స్త్రీ వాద ఉద్యమాలు వైదొలగడం కేవలం తెలివైన కార్పొరేట్ల పాపిష్టి ప్రయత్నాల వలన మొదలవలేదు. 1960, 70లలో స్త్రీలలో చురుగ్గా జరిగిన సమూల సంస్కరణ వాదాన్ని (రాడికలైజేషన్) స్వీకరించటానికి, స్థానం కల్పించటానికి ఈ ఉద్యమాలు సంసిద్ధత చూపించక పోవటంతోనే అది ప్రారంభం అయ్యింది. తమ సనాతన సమాజాలలోనూ ఇంకా వామపక్ష ఉద్యమాలలో అభ్యుదయ నాయకులుగా చెప్పబడుతున్న వారిలోనూ ఉన్న పురుషాధిక్యత మరియు హింసలకు వ్యతిరేకంగా స్త్రీలలో పెరుగుతున్న అసహనాన్ని గ్రహించడంలో ఈ ఉదారవాద స్త్రీ వాద సంఘాలు అమోఘమైన ప్రతిభ కనబర్చాయి. భారదేశంలో లాంటి దేశంలో పట్టణ పల్లె ప్రాంతాల మధ్య వ్యత్యాసం కూడా నడుస్తూ ఉంటుంది. సమూల మార్పు కోరేవి ఇంకా పెట్టుబడిదారి వ్యతిరేక ఉద్యమాలు గ్రామీణ ప్రాంతాలలో కేంద్రీకరించబడినవి. అక్కడ పురుషాధిక్యత ఆ స్త్రీల బతుకులను శాసించేది. పట్టణ ప్రాంతాల నుండి వెళ్ళి ఈ ఉద్యమాలలో (నక్సలైట్ ఉద్యమం లాంటివి) పనిచేసిన స్త్రీ ఉద్యమకారులు తరువాత పాశ్చాత్య స్త్రీవాద ఉద్యమంతో ప్రభావితులు అయ్యారు. ప్రజలతో కలవాలని వారి మగ నాయకుల ఉద్దేశ్యంతో ఉదారవాదం వైపు వీరి ప్రయాణం తరచుగా ఆటంకాలకు గురి అయ్యింది. చాలా మంది స్త్రీ ఉద్యమ నాయకులు వారి జీవితాలలో రోజువారీ అణచివేత, వివక్ష పోవటానికి ‘విప్లవం’ వచ్చేవరకు వేచి ఉండటానికి సిద్ధంగా లేరు. జండర్ సమానత్వం విప్లవానంతర వాగ్ధానంగా కాక అది వారికి అత్యవసరమైన, సంపూర్ణమైన, చర్చలకు తావివ్వని విప్లవ కార్యాచరణ భాగంగా వారు కోరుకొన్నారు. సరైన దృష్టి లేని , తెలివైన, ఆగ్రహం కలిగిన స్త్రీలు క్రమంగా దన్ను కోసం, ఉపాయం కోసం వేరే దారులు వెదికారు. దాని ఫలితంగా 1980 చివర్లో భారత మార్కెట్లు తెరిచే సమయానికి భారదేశంలో ఉదారవాద స్త్రీవాద ఉద్యమం విస్తృతంగా ‘ఎంజీవోనైజ్’ అయ్యింది. గృహ హింస, ఎయిడ్స్, సెక్స్ వర్కర్స్ హక్కులు మీద చాలా ఎంజీవోస్ పని చేశాయి. కానీ ఈ ఉదార వాద స్త్రీ ఉద్యమం తమను ఎక్కువగా పీడిస్తున్నప్పటికీ నూతన ఆర్ధిక విధానాలను సవాలు చేయటంలో ముందు భాగాన లేదు. నిధులను ఉపాయంగా పంచుతూ ఈ ఎంజీవోలు, స్త్రీల రాజకీయ కార్యాచరణ ఎలా ఉండాలి అనే విషయంలో సరిహద్ధు గీతలు గీసి గెలిచాయి. ఎంజీవోల నిధుల సారాంశాలు ఇప్పుడు ఏవి స్త్రీల సమస్యలో, ఏవి కావో  చెబుతాయి.

స్త్రీల ఉద్యమం ప్రభుత్వేతర రంగ సంస్థగా మారటం అనే విషయం పాశ్చాత్య ఉదారవాద స్త్రీ వాదం అసలు స్త్రీ వాదాన్ని ప్రామాణికంగా మోసేటట్లుగా చేసింది. (దాని ఫండడ్ బ్రాండ్ స్వభావం వలన). ఇక మామూలుగానే స్త్రీల శరీరాల మీద యుద్ధాలు జరిగాయి. ఒక వైపు బొటోక్స్ (బోటోక్స్ అంటే స్త్రీల శరీర ముడతలు మాయమవటానికి ఇచ్చే ఇంజెక్షన్స్) ఇంకో వైపు బురఖాలు. (ఈ రెండిటి వలన బాధింపబడ్డ వారు కూడా ఉన్నారు.) మొన్న ఫ్రాన్స్ లో జరిగినట్లుగా, స్త్రీ ఆమె కోరుకొన్న విధంగా ఉండే పరిస్థితులు కల్పించకుండా వారిని బలవంతంగా బుర్కా నుండి లాగే ప్రయత్నం జరిగినపుడు .. అది ఆమెను విముక్తి చేయటం కాదు, ఆమెను వివస్త్రను చేయ ప్రయత్నించటమే. ఆ చర్య ఆమెను అవమానించటంకిందకూ సాంస్కృతిక సామ్రాజ్యవాదం కిందకూ వస్తుంది. ఒక స్త్రీని బుర్కా నిండి బలవంతంగా బయటికి లాగటం ఆమెను బుర్కా లోకి లాగటంతో సమానం. విషయం బుర్కా కాదు, బలవంతం చేయటం. సామాజిక, రాజకీయ, ఆర్ధిక సందర్భాన్ని ఈ రకంగా కత్తిరించి జండర్ సమస్యను చూడటం ఒక అస్తిత్వ సమస్యగా మారుతుంది. యుద్ధం దుస్తులకూ అస్తిత్వానికీ మధ్య మారుతుంది. ఈ సంగతే 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినపుడు యుఎస్ ప్రభుత్వం పాశ్చాత్య ఉదారవాద స్త్రీ గ్రూపులను నైతిక ముసుగులుగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఇచ్చింది. ఆఫ్ఘన్ స్త్రీలు ఇప్పుడు తాలిబాన్ క్రింద భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. పువ్వు లాంటి కత్తులను వదలటం సమస్యను పరిష్కరించదు.