ట్యాగులు

,

04airplanesముంబై లో జరుగుతున్న 102వ భారత విజ్ఞాన సదస్సు కొన్ని తప్పుడు కారణాల వలన చాలా రోజులు గుర్తుండబోతుంది. మొదటి సారిగా ఈ సదస్సులో ‘సంస్కృతంలో ప్రాచీన శాస్త్ర విజ్ఞానం’ అనే ఒక సమావేశం జరిగింది. ఈ విజ్ఞాన సభ, భారతదేశంలో జరుగుతున్నముఖ్యమైన శాస్త్రపరిశోధనలను నివేదించే వేదికగా పేరెన్నిక చెందాలంటే ‘సంస్కృతంలో ప్రాచీన శాస్త్ర విజ్ఞానం’ అనే అంశం దాని ప్రామాణికతను తగ్గించి వేస్తుంది. ఇది పబ్లిక్ సమావేశం అయినప్పటికీ ఈ విషయాన్ని ఈ సదస్సు కార్యకాలాపాలలో చేర్చటంలో కారణం కనబడటం లేదు. సీరియస్ స్కాలర్స్ రాసిన పరిశోధనా పత్రాలతో సంబరం చేసుకోదగినంత వాస్తవమైన, దృఢమైన విజయాలు సాధించిన చరిత్రకు ఈ వేదిక అంకితం అయితే బాగుండేది. ఈ దేశీయ కార్యక్రమానికి ముందే కాస్మటిక్ సర్జరీ వెయ్యి ఏళ్ళ క్రితమే అభ్యాసం చేయబడిందనీ, అండ ఫలదీకరణలాంటి పని చాలా కాలమే క్రితమే మొదలయ్యిందనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రాచీనత మీద వున్న వెర్రితో యిచ్చిన ఉపన్యాసం, యింకా రకరకాల రాజకీయ నాయకుల అనేక అవాస్తవ ప్రకటనలు .. యివన్నీ ఈ అంశాన్నిచేర్చటానికి కారణాలు అని ప్రస్ఫుటంగా అర్ధం అవుతుంది. శాస్త్రీయ ఉత్సాహాన్ని ప్రోత్సహించకుండా ఈ సదస్సు అవాస్తవ విజ్ఞానాన్ని యువత మెదళ్ళలో నాటబోతుంది. 7000 బిసి నుండి 6000 బిసి వరకు జరిగిన ఖండాతర ప్రయాణాలలో భారతీయుల విమానాల తయారీ విజ్ఞానం .. సజీవమైన, నిర్జీవమైన వస్తువుల నుండి శక్తిని కనుక్కొనే రాడార్స్ .. మొదలైన విషయాల మీద పత్రాలు సమర్పించబోతున్నారు.

శాస్త్ర విజ్ఞానం అనేది పునరుత్పాదనం ఫలితాల మీద ఆధారపడి ఉంది. ప్రాచీన ప్రపంచంలో ఆధునిక విజ్ఞానంగా, టెక్నాలజీగా చెప్పబడుతున్నది కొన్ని రిఫరెన్స్ మీదా యింకా ప్రాచీన రాతల మీద ఆధారపడింది. అవి పూర్తిగా ఊహాజనితమైనవి. ఉదాహరణకు ‘ఎగరడమనేది’ ప్రాచీనకాలం నుండి అనేకానేక నాగరికతల్లో మనిషి ఊహ. అలాంటి వాటిని నమ్మకాలుగా తీసుకోవాలి కాని విజ్ఞాన వాస్తవాలుగా తీసుకోకూడదు. గ్రీకు పురాణాల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పుడు అవయవాలు, కణాలు వున్న జంతువులను సృష్టించగలరు. అంతమాత్రాన గ్రీకులు చిమేరాలను (ముఖం సింహం, వళ్ళు గొర్రె, తోక పాము కాగల గ్రీకు పురాణాలలో ఉన్న జంతువు) సృష్టించిన వారిగా గుర్తించగలమా? ఈ సైన్స్ ఫిక్షన్ యుగంలో జెనిటిక్స్ ను అర్ధం చేసుకొని శరీరం వెలుపల అండాలను ఫలదీకరించి డిజైనర్ పిల్లలను పుట్టించే సామర్ధ్యమ్ నేర్చుకొని ఎన్నో రోజులు కాక పోవటం మంచిదైయ్యింది. లేకపోతే సైన్స్ ఫిక్షన్ రాసిన వాళ్ళనే ఈ పద్దతులు కనుగొన్నవారని అనగలరు.

సర్.ఆర్ధర్ సి క్లార్క్ 1945లో కమ్యూనికేషన్ శాటిలైట్ లకు సంబంధించిన సిద్ధాంతాన్నిప్రచురించటాన్ని ఈ విషయంతో పోల్చాలి. డజన్లకొద్ది జియో సింక్రనస్ అంతరిక్ష ఉపగ్రహాలు ఊహించిన రీతిలో ప్రతి సంవత్సరం తయారవుతున్నాయి.