ట్యాగులు

5e3a8-lonlywomanఎప్పుడు మొదలైయిందో నడక

ఎక్కడ మొదలయిందో ….

 

ముళ్ళు చూసుకుంటూ రాళ్ళు

తప్పుకుంటూ..

 

అప్పుడప్పుడూ కూచుని కాసేపు

అలుపు తీర్చుకుంటూ..

 

ఆ నుదుటి ముడతల్లో తీరని

కలతలున్నాయా?

 

ముడివడిన కళ్ళల్లో ఏవో

ప్రశ్నలున్నాయా …?

 

కనబడే కాఠిన్యం వెనుక విషపు

అనుభవాలు ఉన్నాయా?

 

ఈ లోకానికి

 

స్త్రీ ముఖం ఎప్పుడు

వ్యక్తమయినది గనుక?