ట్యాగులు

, , , , ,

మతపరమైన సెంటిమెంట్ల పేరుతో ఆలోచించే, ఆచరించే సమాజ ఆవిర్భావాన్ని అడ్డుకొనే ప్రయత్నం  -రొమెల్లా థాపర్

6

భావవ్యక్తీకరణ స్వేచ్చఅనేది ప్రపంచ మానవ హక్కుల ప్రకటన. ఈ హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. కానీ వచ్చే కొద్దీ ఈ హక్కు ‘కాపలా గుంపులు’ గా చెప్పబడుతున్న వారితో అతిక్రమించబడుతుంది. ఇది బాధ్యత లేకుండా పరిపాలించే వారికి అనుమతి ఇస్తుంది. ఇప్పుడీ హక్కు నాగరిక సమాజానికి అవసరం అయ్యింది. ప్రభుత్వ హామీలకు అతీతంగా మనం ప్రతిధ్వనించాలి. మన హక్కులు రక్షించుకోవటం మన బాధ్యత అవుతుంది. సమాజంలోని ఒక వ్యక్తి స్వయం ప్రతిపత్తిని కాపాడే ఈ హక్కును గురించి బహిరంగంగా, సంపూర్ణంగా చర్చించాలి. మనందరం మనుషులము. మర యంత్రాలము కాదు.

ఎందుకంటే మతపరమైన సెంటిమెంట్లు గాయపడ్డాయనే అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఈ అభ్యంతరం ఎవరూ అడగని, ఎవరూ సమాధానం చెప్పని ప్రశ్నలను వేస్తుంది. ఈ అభ్యంతరం పూర్తి సమాజాన్ని ప్రతిఫలిస్తుందా లేక అందులో ఒక వర్గాన్ని ప్రతిఫలిస్తుందా? ఎవరు ఈ రకమైన సమాజాన్ని ఏర్పరచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? మనం కూడా ఒక సమాజానికి ప్రాతినిధ్యం వహించి, మన భావవ్యక్తీకరణ స్వేచ్చతిరస్కరింపబడి, మన మనోభావాలు లోతుగా గాయపడ్డాయని చెప్పవలసిన టైమ్ వచ్చింది. మనం ఇతరుల హక్కులను తీసిపారేయడం లేదు. మన వ్యక్తీకరణ హక్కును కాపాడుకోవాలి.

నవలపై అభ్యంతరం

ఈ గాయపడిన మనోభావానికి నిజమైన కారణం అడగాలి. ఇది నిజంగా మతం మీద అపనింద వలన వచ్చిందా? లేక మతం మన సామాజిక విలువలుగా చెప్పబడుతున్న వాటికి ముసుగుగా ఉపయోగపడిందా? మధోరుభాగన్ లో పెరుమాళ్ చెప్పినది ఏమిటి? అది ఒక మానవ అవస్థ – పిల్లలు లేని జంట పిల్లలు కావాలనుకొనే పరిస్థితిని అద్భుతమైన సున్నితత్వంతో, ఆరాటంతో, సౌమ్యతతో వర్ణించబడింది. ఇప్పుడు ఇక్కడ చట్టబద్ధత లేని పాత హిందూ ఆచారాన్ని బయటకు తీసుకొని వచ్చినందుకు ఈ అభ్యంతరమా? లేక ఈ నవల ఒక మత ఆచారాన్ని అపభ్రంశ పట్టింస్తుందనా?

మనిషికీ సమాజానికి గల సామీప్యం ఈ వర్ణనలో దాగుంది. ఇందులో ముఖ్య పాత్రలు సంతోషంగా ఉన్నా, పిల్లలు లేకపోవటం వలన సమాజం చేత వేధింపబడతారు. ఎప్పుడూ స్త్రీలే ఈ విషయంలో పురుషుల కంటే నిందింపబడతారు. వాళ్ళే ఈ సమస్యకు మార్గం కనుక్కోవాల్సి ఉంటుంది. సాంప్రదాయకంగా న్యాయమని నిర్ణయించబడిన పరిష్కారాన్ని ఆమెను అనుసరించమని ఆమెకు అందరూ సలహాలు ఇస్తారు. అది అనైతికమైనదని ఎవరూ అనరు. ఆ రోజుల్లో పిల్లలు లేనివారికి ఇది ఒక దయతో కూడిన దారి అయి ఉంటుందా? ప్రత్యేకమైన మతపరమైన సందర్భంలో గర్భం రావటానికి అపరిచితులతో సెక్స్ జరపటం నేరంగా పరిగణించకుండా మత ఆచారంగా అనుమతించి అంగీకరించేవారు. పాత రోజుల్లో బ్రాహ్మణ చట్టాలకు బయట ఉన్న ఆచార నియమాలు ఆ సంఘం ఆమోదించినత కాలం న్యాయమైనవిగా భావించేవారన్న సంగతి ఈ నాటి ప్రజలు స్వీకరించరు. ఈ ఆమోదాన్నే ఈ నవలలో వివరంగా రాశారు.

ఈ ఆచారం ఒకప్పుడు అంగీకరించబడి ఇప్పుటి ధర్మానికి వ్యతిరేకంగా ఉందనీ, ఈ నవలలో దానికి ఆమోదం ఇవ్వటానికి ప్రయత్నించారనా అభ్యంతరం? అసలు అభ్యంతరం ఈ ఆచారాన్ని హిందూ మతం ఆమోదించింది అని చెప్పటం మీద ఉంది. గతంలో ఆచరించిన విషయాన్ని ఇప్పుడు రాయటం ఈ రోజు జరిగినట్లుగా చెప్పటం కాదు. మతాన్ని అప్రదిష్ట పాలు చేయటం కాదు. నవలలో రాసినట్లుగా ఆ నాటి సంఘ న్యాయం అది.

ఇంకేమైనా కారణం ఉండి ఉంటుందా? ఈ పిల్లలు లేని సమస్యకు పరిష్కారంగా చెప్పింది భర్తకు అపకీర్తి తెచ్చేది అయి ఉంటుంది. ఎందుకంటే భార్య పరాయి పురుషునితో గర్భవతి అయితే అది భర్త నపుంసకత్వాన్ని సూచిస్తుంది. పురుషాధిక్య సమాజంలో, స్త్రీ అన్నిటికీ బాధ్యురాలు అవుతున్నప్పుడు ఈ ఆచారం ఆమోదించబడదు. ఇప్పుడున్న కరుడు కట్టిన పితృస్వామిక సమాజంలో ఇది ఏ మాత్రం అంగీకారం కాదు. భర్త అంగీకారం డోలామయంగా ఉండటంతో చివరకు ఈ కధలో ఆ స్త్రీ స్వతంత్రమైన నిర్ణయం తీసుకొంటుంది. దీన్ని పితృస్వామ్యానికి వ్యతిరేకంగా భావించారా? అదేనా ఈ అభ్యంతరానికి అంతః సూత్రంగా వున్న సంగతి? అభ్యతరం హిందూ మతాన్ని తక్కువ చేసి చూపిస్తున్న కర్మకాండ గురించినదా? లేక ఆ ముగుగులో స్త్రీ తనకు తానుగా తన భర్తకూ, అతని కుటుంబానికీ, సమాజానికీ సంబంధించిన ఒక నిర్ణయం తీసుకొనే హక్కుని తిరస్కరించడమా? స్త్రీలకు స్వతంత్రం ఇవ్వడమే అభ్యతరానికి కారణమయితే అందులోకి మతాన్ని లాగడం ఎందుకు? హిందూయిజాన్ని భ్రాష్టుష్టు పట్టించారని అనడం ఎందుకు? ఎందుకంటే అలా చేయటం వలన ఎక్కువ ప్రచారం వస్తుంది కాబట్టి.

తెలివిగా రచయితను నిశ్సబ్ధం చేశారు. మనుషుల్ని నోరు ముయ్యించటానికి చాలా మార్గాలు ఉన్నాయి. గొడవలు వచ్చినపుడు భౌతిక దాడి చేయడం అనైతికం, అన్యాయం అవుతుంది. ఇక మిగిలింది భావోద్వేగపరంగా, మేధోపరంగా నోరు మూయించటం. మతాన్ని బ్రష్టు పట్టించాడని చెప్పి రచయితను నోరు మూయించడం. తనంతట తానుగా మౌనంగా అయిపోయి పెరుమాళ్ తన సున్నితత్వాన్ని చాటుకొన్నాడు. ఆ పుస్తకాన్ని నలిపి వేయాలనీ, నిషేదించాలనీ, కాల్చి వేయాలనీ అనటం దేశంలో ఒక ఎజండాగా మారిపోయింది. గాయపడిన మత మనోభావాల పేరుతో .. ఆలోచించే ఒక సమాజ ఆవిర్భావాన్ని, ఘర్షణ పడే విషయాల మీద చర్చనూ, చారిత్రాత్మకంగా వస్తున్న పెద్ద మార్పులను అర్ధం చేసుకోవటాన్ని అడ్డుకోవటమే ఈ ప్రయత్నానికి ఉన్న నిజమైన ఉద్దేశ్యం. మనం యింకా మార్పులనూ, ఘర్షణలనూ ఎదుర్కోవటానికి ఇది ఒక క్రమం. కనుక మనం ఈ క్రమాన్ని అర్ధం చేసుకోవాలి. వాళ్ళ దిశలో సమాజాన్ని తిప్పుకోవాలనుకొనే వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు.

మనమేం చేయాలి? మురుగన్ తనకు తానే విధించుకొన్న నిషేదాన్ని ఖండించాలా? నేను అనుకొన్నట్లుగా, ఇంకా చాలా మంది అనుకొన్నట్లుగా మురుగన్ వైపు నిలబడాలా? అతని నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని అతన్ని యింకా రాయమని ఆహ్వానించాలా? భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అతనికి హామీ ఇస్తూ అతని చేత రాయించాలి. చెన్నైకి అతని వలస ఒకరకమైన ఏకాంతవాసం లాంటిది. మనము అతన్ని అలా పోనివ్వకూడదు.

మనకు పూర్తిగా భావవ్యక్తీకరణ స్వేచ్చలేక పోవచ్చు. కానీ కనీసం రచయితలుగా అతనితో బాటు ఆ వృత్తిని ఎన్నుకొన్న వారి నుండి ఆయనకు ఆ హామీ నిర్ణయించబడాలి. అది కనీసం ఒక వివేకవంతమైన చర్చను లేవదీస్తుంది. ఏ సంస్థకైనా, ఎవరు రాసిన దానినైనా వ్యతిరేకించే హక్కును ఈ విషయం నిరాకరించడం కాదు. ఇది ఒక రచయితను ఎవరూ కలం మూయించలేరని గట్టిగా చెప్పడం. కానీ తమకు తామే బహిష్కరించుకొంటే ఎక్కడ గీత గీయగలం? ఈ విషయం వృత్తిపరంగా ఇందులో తలదూర్చిన వారి చేతుల్లో ఉంది. రాజకీయంగా కాపలాదారుల చేతుల్లో ఉండకూడదు. ఎలా చేసినా ఈ విషయం హింసతో భయపెట్టే వ్యక్తులతో కూడిన సంస్థల చేతుల్లో ఉండకూడదు. రచయితలను, పబ్లిషర్స్ ను భయపెట్టి వారికి వ్యతిరేకంగా చేస్తున్నారు. మనం ఒక నిశ్శబ్ధ సమాజంగా మారిపోయామా?

హక్కుని రక్షించుకొందాం

ఈ విషయాన్ని టాకిల్ చేయడానికి ఇంకా సమర్ధవంతమైన దారులు ఏమైనా ఆలోచించగలమా? కొన్ని సంస్థలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడటానికే పనిచేస్తే కొంత సహాయకంగా ఉంటుంది., ముఖ్యంగా రచయితల కోసం. పబ్లిషర్స్, లాయర్లు, కొందరు రచయితలతో ఇది తయారవ్వాలి. రచయితలను బెదిరిస్తున్న, అవమానిస్తున్న వారికి ఒక సవాలుగా ఈ సంస్థ ఉండాలి. బెదిరించే సంస్థలు, అందులో పని చేసే వ్యక్తుల పేర్లు చెప్పగలిగేటట్లు ఉండాలి. అవసరమయితే కోర్టు జోక్యం గురించి కూడా ఆలోచించాలి. వివాదాస్పద విషయాల గురించి భయపడే వారికి ఈ సంస్థల నుండి వచ్చే ప్రకటన ధైర్యాన్ని ఇవ్వాలి.

‘ద హిందు’ సౌజన్యంతో