ట్యాగులు

,

3315_front_cover

అప్పుడు

నావి కాని లోకాలలో

అపరిచితనై, శరణార్ధినై నేను సంచరిస్తున్నప్పుడు

జీరబోయిన గొంతులో ఉయ్యాలూగుతున్న ఓ పిచ్చి గీతానికి

కష్ట జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలే

సరిగమలుగా కట్టి ఆలాపన చేయించావు.

తొలి వేకువ భ్రమలలో

దృశ్యాదృశ్యం అవుతున్న ఒకానొక అరూపానికి

నీ తాత్విక నిశిత నేత్రాన్ని సాయంగా యిచ్చి

విప్లవకాంక్షను నాకు సాక్షాత్కరించావు.

తూకం తప్పే అడుగులకు లయ ఇచ్చి

సాంస్కృతిక ఉపద్రవాన్ని అడ్డగించే

శివతాండవం నను చేయమని కోరుకొన్నావు.

ఇంతకీ నువ్వు ఉద్యమానివా? కళా రూపానివా?

ఉద్యమానికి పాటై మిగిలి పోయిన వాగ్ధానానివి నువ్వు కదూ?

పాటకు జవజీవమైన ఉద్యమ సంగీతానివి నువ్వే కదూ?

ఉద్యమ పాటకు చిరునామా అయిన కానూరి తాతవు కదూ!