chitradarsanam

అమ్మాయి అమ్మాయి!

ఊగేటి బుజ్జాయి!

ఊగి ఊగి బంధాలు తెంచుకొంటావా!

సాగి సాగి విశ్వమంతా తిరిగి వస్తావా!

ఎర్రటి కొలిమికి బొగ్గు తెస్తావా?

మబ్బుల్లో మెరుపులను

మనుషులకి తెస్తావా?

కొడవళ్ళు కాసేటి చేనుకు

యిత్తులు తెస్తావా?

విప్లవ యోధవవుతావా?

పంచాది నిర్మలవుతావా?

ప్రకటనలు