ట్యాగులు

, ,

12038460_1633995236883500_580418987515787178_n

ఆ దేహం నేడు విచ్ఛిన్నమైంది

కానరాని జాగాలలో ఆమ్ల తాకిడికి అది కమిలి కాలిపోయింది

అణువణువు వెంపర్లకు గురై చావు వరకు అది పోరాడి ఉంటుంది

బహుశ

ధన దాహానికి ఆమె సజీవ దేహం సవాలు విసిరి ఉంటుంది

ఏలుబడికి ఆమె భౌతిక చలనం ప్రతి ప్రశ్న వేసి ఉంటుంది

కానీ

ఆ అడవి దాపున యిప్పపూల చెట్టు నుండి ఆమె చివరి వాంఛ

బయటికి ఎప్పుడో అలుముకొన్నది

దారి పొడవునా వున్న పోడుచెలక దాన్ని పునః ప్రసారం చేస్తోంది

నేడు భూమ్యాకాశాలను ఆమెగల పసి పిల్లలకై ప్రేమ ఆవహించి ఉంది

వేలాది గుండెకాయలకు అది ఎప్పుడో పాకి పోయింది.

ఆమె

నింగిలో నిలబడి వాడిని చూసి విరగబడి నవ్వుతోంది