ట్యాగులు

, , ,

NEW DELHI, INDIA - SEPTEMBER 14: (L-R) Candidates of AISA, President Ashutosh Kumar, Vice President Anat Prakash Narayan, Gen. Sec. Chintu Kumari and Joint Sec. Shafqat Hussain Butt enjoying victory, as they won all 4 posts in Jawaharlal Nehru University Students' Union (JNUSU) elections at JNU Campus, on September 14, 2014 in New Delhi, India. More than 54 per cent students exercised their franchise in the students' union polls of JNU, where women's safety and hostel facilities surfaced as the key issues. (Photo by Sanjeev Verma/Hindustan Times via Getty Images)

బిర్ర బిగుసుకొని
శాల్యూట్ చేసే సిపాయిల్లాగా
కంఠనాళాలు గట్టిపడతాయి.
ఉత్తేజం ఉవ్వెత్తున ఎగిసి
పిడికిటి చెమటను ఒత్తిపడుతూ
బిగుసుకొన్నచేతివేళ్ళు
ఒక్క వాక్యాన్ని వక్కాణిస్తాయి.
నీలో నిద్రాణ శక్తుల మేల్కొని
నువ్వు, నేనూ, యింకా వందల ఆత్మలను
అనుసంధానిస్తాయి
భావజాలం లయబద్ధంగా మేళవిస్తుంది
నీ గొంతుకకు వంత పాడిన ఆ లలిత గేయాలు
యుద్ధ భేరీలై
స్వరాన్ని ఒంటరి కానివ్వమని
పూచికత్తు యిస్తాయి
నినాదం పిరికితనం కాదు
నినాదం రాజద్రోహం కాదు
నినాదం
ఆదిమ మానవుడు మోరెత్తి
వేసిన ఆకలి కేక
నినాదం
మానవజాతి ముదుకురుకుతూ
పాడిన పురో గానం
నినాదం
ఒక వెదుకులాట
నినాదం
ఒక తీరని తృష్ణ
నినాదం
ఒక న్యాయమైన కోరిక
నినాదం
ఒక మహత్తర
విప్లవ బృంద గీతిక