ట్యాగులు

, , , , , , , , , , , ,

సిరియా, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, యెమన్, టర్కీ, లెబనాన్ దేశాలలో మహిళలపై పెరుగుతున్నఅణచివేత – మిలటరీ రూపం తీసుకొంటున్న మహిళా ఉద్యమాలు

పునాది వర్గాల మహిళల రెండో ప్రపంచ సదస్సు, 2016లో మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) రిపోర్టు

YPJ_fighters_3మధ్య ప్రాచ్యం గురించి ఆశాజనకమైన వార్తలు దురదృష్టవశాత్తు చెప్పలేక పోతున్నాము. మూడో ప్రపంచ యుద్ధానికి ఇప్పుడు మధ్యప్రాచ్యం వేదికగా ఉంది. ఈ యుద్ధం స్త్రీలనూ, పిల్లలనూ టార్గెట్ చేస్తున్నది. దాదాపు ఒక కోటిమంది ఈ యుద్ధంలో చనిపోయారు. ఎంతో మంది నిర్వాసితులు అయ్యారు. మధ్యధరా సముద్రప్రాంతం శరణార్ధులకు శ్మశానం అయ్యింది. ప్రజలు దాని ద్వారా భద్రమైన ప్రదేశాలకు వెళ్ళ ప్రయత్నిస్తూ మరణిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పాలస్తీనా సమస్య పరిష్కరించబడలేదు. సిరియా, ఎమెన్ లాంటి దేశాల్లో మారణహోమం జరుగుతుంది. మానవత్వానికి చెరగని మచ్చలాగా చరిత్ర దీన్నంతా రికార్డ్ చేస్తుంది.

middle east

మధ్యప్రాచ్యంలో యుద్ధం దాని స్వభావాన్నిమార్చుకొని కొత్త చలనశీల సూత్రాలతో ముందుకు వస్తుది. ఇది కేవలం నయా వలసవాదం కాదు. ఈ యుద్ధం మతసంబంధమైన ఘర్షణలలతో కూడినది కూడా. ఎన్నోవేల సంవత్సరాలుగా మధ్యప్రాచ్యంలో నివశిస్తున్న ప్రజలకు వారి భవిష్యత్తు గురించి సొంత పధకం ఉంది. ప్రజాస్వామిక దేశాలతో కూడిన, ప్రజాస్వామిక స్వయం ప్రతిపత్తి గలిగిన మధ్యప్రాచ్యం ఇక్కడి ప్రజల కల. ఈ ప్రజలు ముఖ్యంగా సిరియా, టర్కీలతో కలసి తమ పధకాన్ని సాకారం చేసుకోవాలని అనుకొన్నారు. ఈ ప్రజాస్వామిక మధ్యప్రాచ్యం అమలు మహిళల నాయకత్వాన జరుగుతుంది. నిజమైన విప్లవాలకు స్త్రీ స్వభావం ఉండాల్సిన అవసరం ఉంది. మహిళలు అందరూ కలిసి నిజమైన మార్పును తీసుకొని రాగలరు. మధ్య ప్రాచ్యంలో రాబోయే ప్రజాస్వామిక, విముక్త, బహుళ స్వభావం కలిగిన సమాజ ఆవిర్భావానికి జరిగే పనిలో స్త్రీలు ప్రధాన భూమిక వహిస్తారు.

టర్కీ

టర్కీలో మహిళా విముక్త పోరాటం బహుశా ప్రపంచంలోనే అతి క్లిష్టమైన పోరాటం. ఎందుకంటే టర్కీలో నివశిస్తున్న మహిళలు ఇస్లాం మత ఛాందసవాద, ఫాసిస్టు, సెక్సిష్ట్, పితృస్వామిక స్వభావం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నారు. వారి శరీరాల మీదా, వారి ఉద్యమాల మీదా, వారి హక్కుల మీదా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుటి ప్రభుత్వం వారికున్న దారులన్నీ మూసి వేయ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా గత కొద్ది నెలలలో మహిళా దళాలను టర్కిష్ సైన్యాలు చట్టాలకతీతంగా చంపేశాయి. ఈ మారణహోమం జరపటం ద్వారా టర్కిష్ ప్రభుత్వం మహిళల ప్రతిఘటనను అణచివేయ ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ జరుగుతున్న మిలటెంట్ మహిళా పోరాటం తాను బలపడటం ద్వారా ఈ రకమైన దాడులకు సమాధానం చెబుతున్నది. టర్కీలో ఉన్న కుర్ధిస్తాన్ భూభాగంలో జరుగుతున్న ఉద్యమంతో టర్కిష్ మహిళా ఉద్యమం కలిసి పయనిస్తున్నది. టర్కిష్ ఫాసిజానికి రాడికల్ వామపక్షంతో కూడిన కుర్ధిష్ ఉద్యమం ఒక అవరోధంగా మారటంతో ఈ దాడుల స్వభావం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ద్వంద్వ యుద్ధ స్వభావాన్ని సంతరించుకొన్నది. ముఖ్యంగా స్త్రీలు టార్గెట్ అయ్యారు. గత కొద్ది నెలలలో ప్రతిఘటనా దళాలలోని మహిళా కామ్రేడ్లు చంపివేయబడ్డారు. 20 కంటే ఎక్కువ కుర్ధిష్ మహిళా ‘మాయలు’ (కుర్ధిస్తాన్ దళాల్లో ‘మాయలు’ ‘ఉపమాయల’ పేరుతో ఉంటారు) జైళ్ళలో ఉన్నారు, లేక మాయమైపోయారు. చంపేసిన కుర్ధిష్ దళాల మహిళల శవాలను, గెరిల్లా మహిళల శవాలనూ వారి పిల్లలతో సహా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో టర్కిష్ భద్రతాదళం షేర్ చేసింది. అలా చేసి కుర్ధిష్ సమాజంలో ‘అమ్మ’లుగా గౌరవించబడుతున్న కుర్ధిష్ మహిళల మీద టర్కిష్ సైన్యం దాడి చేయపూనుకొన్నది. దానికి సమాధానంగా మా ‘అమ్మలకు’ స్వాతంత్ర్యం కావాలంటూ మహిళలు ఇంకా వారి పోరాటాన్ని బలోపేతం చేశారు.

సిరియా మరియు రొజావా

Rojava_cities

సిరియా, రొజావాలలో మహిళలు యుద్ధం వలన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. (రొజావా సిరియాలో కుర్ధిష్ భూభాగం) చాలా మంది ప్రజలను దేశం వదిలి పోమని వత్తిడి తీసుకొని వస్తున్నారు. కానీ రొజావా ఐసిస్ కీ, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా మహిళల పోరాటానికి నమూనాగా ఉన్నది. ఇప్పుడు రొజావాలో మహిళా విప్లవం జరుగుతోంది. మహిళలు ఇక్కడ నాయకులు. సామాజిక, రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకొని వారు ప్రజాస్వామిక విముక్తిని కోసం పోరాడుతునారు.

ఇరాన్

ఇరాన్ లో మహిళలు యుద్ధం వలనా, పితృస్వామ్యం వలనా ఎన్నో బాధలు పడుతున్నారు. పురుష సంస్కృతి రాజకీయాల దగ్గర నుండి సామాజిక విషయాల వరకు డామినేట్ చేస్తుంది ఇక్కడ. ముప్ఫై శాతం రిజర్వేషన్ మహిళలకు ఉన్నప్పటికీ మహిళలు అన్ని రంగాలలో తిరస్కరింపబడుతున్నారు. అయితే వారి పోరాటాల వలన స్త్రీలు వస్తువులు కారు అనే భావన రుజువు అవుతుందిక్కడ. ఐసిస్ ను ఎదుర్కోవటానికే కాకుండా, పురుష హింసను ఎదుర్కోవటానికి కూడా చాలా మంది మహిళలు ఆత్మ రక్షణ శిక్షణ తీసుకొంటున్నారు ఇక్కడ. ఈ దేశం బయట ప్రపంచంలో తన ఇమేజ్ ను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇరాన్ లో మహిళల పై దాడులు పెరుగుతున్నాయి. ఇరాన్ రాజ్యం మహిళల హక్కుల పోరాటాన్ని అణచటానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ చాలా మంది మహిళా రాజకీయ ఖైదీలు ఉన్నారు. ఎక్కువ మంది ఉరితీతకు దగ్గరలో ఉన్నారు. వారిలో జనాలియా ఒకరు. ఆమె ఆరు సంవత్సరాల నుండి జైలులో ఉంది. ఇరాన్ లోనూ, ఇరాన్ ప్రాంతంలో వున్న కుర్ధిష్ ప్రాంతంలోనూ మహిళల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ, మహిళా విముక్తి కోసం పోరాటాలను కొనసాగించటం కష్టమై పోతున్నప్పటికీ, అక్కడ మహిళా ఉద్యమాలు రాజ్యానికి వ్యతిరేకంగా రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

పాలస్తీనా

పాలస్తీనాలో యుద్ధం మహిళల జీవితాలను ఆస్తవ్యస్తం చేస్తున్నది. ఇజ్రాయిల్ ఆక్రమణ, దాడులూ గొప్ప దుఃఖాన్ని స్త్రీలకు కలగచేస్తున్నాయి. ఇక్కడి మహిళలు పోరాటాలకు సిద్దంగా ఉన్నప్పటికీ వారిని రాజకీయ విధివిధానాలకు దూరంగా ఉంచారు. పాలస్తీనాలో ఉన్న వివిధ మహిళా సంస్థలతో చర్చలు జరపటం కూడా కష్టం అయ్యింది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు పాలిస్తీనా లో మహిళా పోరాటాలు స్వతత్రంగా బలోపేతం అవుతున్నాయి.

లెబనాన్

లెబనాన్ లో అనేక మహిళా సంస్థలు అనేక హక్కుల కోసం పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రత్యక్ష యుద్ధం లేనప్పటికీ రాజకీయ ఘర్షణ మహిళల జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నది. దురదృష్టవశాత్తూ ఇక్కడ మహిళలు కష్టపడి రెండు సంవత్సరాలుగా నిర్మించుకొన్న ఉద్యమాలను గెలుచుకోవటానికి యిస్లాం సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి.

మొత్తంగా చెప్పాలంటే మధ్య ప్రాచ్యంలో మహిళల పరిస్తితి అత్యంత క్లిష్టంగా ఉంది. వీరంతా యుద్ధాలలోనూ, ఘర్షణలలోనూ చిక్కుకొని ఉన్నారు. అయితే ఇక్కడ సుదీర్ఘ మహిళా ఉద్యమాల చరిత్ర కూడా ఉన్నది. ఫ్యూడలిజానికి, కేప్టలిజానికి, సామ్రాజ్యవాదానికి ఇక్కడి మహిళలు వారి పోరాటాలతో సమాధానం చెబుతున్నారు. ప్రజాస్వామిక మధ్యప్రాచ్యంకోసం వారు అణువణువునా పోరాడుతున్నారు. రొజావా, కొబాని ప్రాంతాలు మహిళా ప్రతిఘటనకు నమూనాగా, సాంస్కృతిక వారసత్వంగా, చరిత్రగా మిగిలిపోతాయి. వలసవాద, ఛాందస, లైంగిక పక్షపాత, సామ్రాజ్యవాద శక్తులతో పోరాడుతూ మధ్య ప్రాచ్యంలో మహిళలు చరిత్రను తిరగరాస్తున్నారు. ఈ మాంత్రిక, చారిత్రాత్మక, విప్లవాత్మక ప్రతిఘటన గొప్ప మార్పులు తీసుకొని రాబోతున్నది.

(ఈ రిపోర్ట్ ఏప్రెల్, 2016 మాతృకలో వచ్చింది)