ట్యాగులు

, , ,

21th_illustration_3016986g

ఒక నగరం చాలా విధాలుగా చనిపోతుంది

గమ్యాలు సుదూరంగా ఉండగా ప్రజలు వాహనాలలో ప్రయాణిస్తుంటారు. ఆ గందరగోళం నుండి బయట పడటానికి మార్గాలు వెదుకుతూ.. బైకుల మీద నిల్చోని, కార్ల నుండి బయటకు వంగి చూస్తుంటారు. ఇంతలో ఎవరో వచ్చి నీకూ ముందు వాహనానికి మధ్య ఉన్న చిన్న స్థలాన్ని ఆక్రమిస్తారు. నీ శ్వాస పెయింటింగ్ ను గోకుతున్నట్లు ఒక కారు పక్క రోడ్డు నుండి దూసుకొని వస్తుంది. కాకి కూడా ఎగరలేని స్థలంలో ఒక కారు ‘యూ’ టర్న్ తీసుకోవాలనుకొంటుంది. కార్లు, బస్సులు ఒక సైడ్ రోడ్డులో పార్క్ చేసినట్లు నిలుచొని ఉంటాయి. మనమంతా యింటికి మైళ్ళ దూరంలో నిరీక్షిస్తూనే ఉంటాము.

నగరాలు చనిపోతాయి. అసహనపరులకు, దేనిని లక్ష్యం చేయని వారికీ రెడ్ సిగ్నల్ అంటే పొమ్మనే అర్ధం. వారికి క్రాషింగ్ నివారించాలనుకొనే వాహనాల పట్ల, మనుషుల పట్ల లక్ష్యం ఉండదు. వాళ్లెవరో చట్టాన్ని తలదన్నేవారూ, రౌడీ షీటర్లూ కాదు. ఆ పని చేసేది మనమే. నువ్వు, నేనూ. మన ఫాన్సీ కార్లలో, ఇంకా ఫాన్సీ బైకుల్లో ఈ పనులు చేస్తుంటాము. పిల్లల్ని ముందు కూర్చొబెట్టుకొన్న స్త్రీలు కూడా వారి అందమైన స్కూటీలతో ఆ పనిని చేస్తుంటారు.

నగరాలు చనిపోతాయి. పై సమస్యలకు చాలా సులభమైన పరిష్కారం ఉందని తెలిసినపుడు ట్రాఫిక్ జామ్స్ లో ఆగ్రహం మొదలువుతుంది. అది మనందరి ముఖాల నుండి కళ్ళప్పగించి చూస్తూ ఉంటుంది. మనకు ఏమి చేయాలో తెలుసు. కానీ మనం కార్లలో కూర్చొని గొణుక్కొంటూ మాత్రమే ఉంటాము. ఒక అంగుళం ఇక్కడ, ఒక అడుగు అక్కడ దొరకబుచ్చుకోవటానికే ప్రయత్నిస్తూ ఉంటాము.

ఆగ్రహం మొదలైనపుడు ..

traffic

మార్కెట్లలో, షాపుల్లో, బడుల్లో ఆగ్రహం అందుకొంటున్నప్పుడు నగరాలు చనిపోతాయి. హటాత్తుగా నిలవరించలేని కోపంతో మనం చేస్తున్న చిన్న పనిలో కూడా దూకుడుతనం ముందుకు వస్తుంటే నగరాలు చనిపోతాయి. విభిన్న ముఖాలు, భాషలు మనకు శత్రువులుగా కంబడుతుంటేనూ, విభిన్న ఆచారాలు మనను ఆక్రమించుకోబోతున్న శత్రు మూకలుగా కనిపిస్తున్నప్పుడూ నగరాలు చనిపోతాయి. ప్రతి మనిషి నేరస్తుడు అవుతున్నప్పుడు పోలీసూ, జడ్జ్ మిళితం అయ్యి రాజకీయ నాయకుడు అవుతాడు. మనకీ వాస్తవాలు అన్నీ తెలుసు. విసిగి ఉన్న వాస్తవాలు ఎలాంటి క్రియాశీలక చర్యలను కలిగించలేవు.

మనం దేనినీ లక్ష్యం చేయనపుడు నగరాలు చనిపోతాయి. మనం ఏమైనా చేద్దామన్నా మనకు ఏమి చేయాలో తెలియదు. ఏమి చేయాలో తెలిసినపుడు మనం కదలటానికి కూడా అలసిపోయి ఉంటాము. లేకపోతే శ్వాస సంబంధ సమస్యలతోనో, దోమ కాట్లతోనే ఆగిపోయి ఉంటాము. లేక పోతే ఐ ఫోన్స్ తోనో, మనం చెవుల్లో మారుమోగుతున్న భూలోకేతర సందేశాలతోనో బిజీగా ఉంటాము.

నగరాలు చనిపోయినపుడే మనమూ చనిపోతాము. పిల్లలకు ఆటస్థలాలు ఉండవు. సిగరెట్టు పీలుస్తున్నంతగా వారి ఊపిరితిత్తులు విషపు అవశేషాలతో నిండి ఉంటాయి. ప్లాస్టిక్ బాటిళ్ళ వాసన రాని నీళ్ళంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. వారు బడికి పోవటం ఎంత ప్రమాదం అంటే అది పొగ కమ్మిన పర్వతాలను అధిరోహించేతంతటి ప్రమాదం.

శబ్దాలు మాత్రమే చేస్తూ కదలని అంబులెన్సులలో పెద్దవాళ్ళు చనిపోతూ ఉంటారు. ఒక వేళ వాళ్ళు హాస్పిటల్ కు చేరినా డాక్టర్ గారు ఎక్కడో చిక్కుకొని పోయి ఉంటారు. బీపీ యంత్రాలు ప్రతిధ్వనించక మొత్తం నగరానికే గుండే పోటు వస్తుంది. అయినా చూడడటం తప్ప మనం ఏమీ చేయలేము.

దగ్ధమౌతున్న నగరం

bangalore-riots-71నగరాలు చనిపోతాయి. మోటారు బైకుల మీద యువకులు, వారు కూడా ఎప్పుడూ చూడని జండాలతో వచ్చి ‘నువ్వెవరివీ’ అని అడిగినపుడు నగరాలు చనిపోతాయి. వాళ్ళ ముఖాలులాంటివి లేని వారిని వారు ఆ ప్రశ్న వేస్తారు. ‘నువ్వు చైనా వాడివా?’ అని అడిగాక ‘ఓహో నువ్వు ఈశాన్య ప్రాంతపు వాడివా?’ అనే రెండో ప్రశ్న వస్తుంది. ఇక అప్పుడు వారు వారిని కొడతారు కదా, ఎంతగా కొడతారు అంటే నగరం నుండి నిష్క్రమిస్తున్న రైళ్ల నిండా యువతీ యువకులు… వారి భయాన్ని వదిలించుకోగల స్థలాల కోసం అన్వేషణలో…

ఇప్పుడు ఈశాన్య ప్రాంతపు వారి గొడవ అయిపోయింది. ఇక ఇప్పుడు వారికిష్టమైన పొరుగువారి గురించి. కుర్రాళ్ళు బైకుల మీద వస్తున్నారు. వాళ్ళ జండాలు ఆయిల్ మరకలతో కనబడుతున్నాయి. అయితే వారు వేస్తున్న ప్రశ్న మాత్రం అదే. ఒక గుంపు ట్రాఫిక్ జంక్షన్ లో నిలబడి టైరును కాల్చాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పటికే సిటీ దగ్ధం అవుతూ ఉంటే ఒకటి రెండు టైర్ల విషయం ఎందుకు? వారు మాకు న్యాయం కావాలని అంటున్నారు. ఒక ధైర్యం కలిగిన పెద్దాయన వాళ్ళను ‘మీకు ఏమి న్యాయం కావాలి?’ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మేమిదంతా 200 రూపాయల కోసం చెబుతామని అంటారు.

 

bangalore-riots-pf

పరాయిలు ఆక్రమించాక…

ఎండిపోతున్న కూరగాయలను అమ్ముకొనే పేద వ్యాపారి వీధుల్లో భయం భయంగా చూస్తున్నప్పుడు నగరాలు చనిపోతాయి. వాళ్ళు కూడా మనలాగే ఉండాలనుకొంటారు. ఆయాచితంగా వచ్చిన సెలవును ఆస్వాదిస్తూ, టీవీ వార్తలతో మేల్కొంటూ, నిరంతరం తమ ఉమ్మడి కోపాన్ని రగిలించుకొంటూ మనలాగే ఉండాలనుకొంటారు. వాళ్ళు అన్నీ భాషలు మాట్లాడగలరు, కానీ వారికి తెలుసు అలా మాట్లాడితే వారికి పుట్టగతులు ఉండవని. అవన్నీ మనం మన కటకటాల కిటికీల నుండి చూస్తుంటాము. మనకు తెలుసు మనము ఏమీ చేయలేమనీ, మనము సంఖ్యగానే మిగిలిపోయామనీ, మనం ఎక్కడా, ఎవరికీ పనికి రామనీ.

చిన్న చిన్న విషయాల మీద కోపం మన చుట్టూ ఉన్న అన్ని విషయాల మీద కోపంగా మారినపుడు నగరాలు చనిపోతాయి. చిన్న చిన్న విషయాలు కోపాన్ని, డిప్రెషన్ నూ, ఆస్త్మానూ, డెంగ్యూనూ, గాస్త్రోఎంటెరిటీస్ కలిగిస్తూ ఉంటాయి. జాంబో సినిమాలాగా నగరం పరాయిల కింద వున్నట్లు అనిపిస్తుంది. వారు దోసెలను దోష అంటూ, అన్నాన్ని చిన్న చిన్న స్పూనులతో తింటూ ‘నగరం క్యూట్ గా ఉంది’ అనుకొంటూ ఉంటారు. నగరం మారుమూలల నుండి కలుసుకోవాల్సిన స్నేహితులు వారి వారి ఫ్లాట్లలోకి తిరిగి వెళ్ళిపోయి తలదాల్చుకొంటారు. లేకపోతే ఎక్కువ ప్రయాణం చేయకుండా వారి యింటికి దగ్గరగా ఉన్న మాల్స్ లోకి వెళ్లిపోతారు. ‘ఇంకొక సారి ఎక్కడైనా కలుసుకొందాం… ఎక్కడైనా చనిపోని వేరే నగరాలలో …’

నగరాలు చనిపోతున్నాయి. మనమంతా ప్రతీక్షిస్తుంటాము. ఈ నగరం యవ్వనంలో ఉన్నప్పుడు, ఐటీ భూముల్లో ఉన్న నకిలీ పార్కులు లాగా కాకుండా నిజ ఉద్యానవనాలతో శోభిల్లుతున్నప్పుడూ చూసిన వారికి అదంతా ఒక మధుర స్మృతి. ఆ మధుర స్మృతితో మనకు కనీసం ఏమి చేయాలో అనే ముందు చూపు ఉంటుంది. కానీ ఇప్పుడా భవిష్యత్తు కూడా లేదు. ప్రతివీధి చివర్లో పుడుతున్న చిన్న చిన్న కోపాలతో అది కూడా మరణిస్తోంది. భవిష్యత్తే మరణించినపుడు నగరం ఎప్పుడో చనిపోయినట్లే.