ట్యాగులు

 

?????????????????????????

కాసేపు నా గురించి నేనేమైనా రాసుకొంటానే!

 

ఓడిపోయినా నా ప్రేమతో

కొద్ది సేపు కాగితం తడుపుకొన్నాను

ఉగ్గ పట్టిన బెంగతో మగ్గిపోయి

నీరు కారుతున్న దెబ్బలపై

ఉప్పుగళ్ళు చల్లుకొన్నాను.

మాటి మాటికి చిత్తడవుతున్న కనుపాపలకు

సాంబ్రాణి ధూపమేసేశాను.

 

ఇంక ఫెళ ఫెళలాడే ఎండలో

కాసేపు ఈ మనసుని కాగపెడతాను.

తడి, చెమ్మ తగలకుండా దానికి

వేపాకు పూత పూస్తాను.

 

కొంతకాలం తరువాత ….

గుక్క పెడుతున్న హృదయాలను

ఏడుపాపించి

వారికోసం అక్కడ

సువాసనల పూదోట వేస్తాను.

నేను మాత్రం వేల కేకల ఉత్సవంలో

ఉరికి ఉరికి తరిస్తాను.