ట్యాగులు

, , ,

chitradarSanam photo

మూలవాసీ మహిళా వొళ్ళో

ముద్దులొలికే బిడ్డడ్ని

ఎత్తుకుపోయాడు

హైందవ మాయలపకీరు

ఆదివాసీ మహిళను

అందవికారిని చేసి

అడవి నుండి వెళ్ళగొట్ట చూస్తున్నాడు

రామ రాజ్యుడు

…..

అయితే ఇప్పుడు ఈ స్త్రీలు ….

 

ఉగ్గపట్టిన దుఃఖంతో మగ్గిపోయి

నీరు కారుతున్న దెబ్బలపై

ఉప్పుగళ్ళు చల్లుకొన్నారు

మాటి మాటికి చిత్తడవుతున్న కనుపాపలకు

సాంబ్రాణి ధూపం వేశారు

 

ఫెళఫెళలాడే ఎండలో

మనసును కాగబెట్టారు

తడి, చెమ్మ తగలకుండా దానికి

వేపాకు పూత పూశారు

 

ఇక ఇప్పుడు వీళ్ళు ….

పొడుగు టోపీ మంత్రగాడినీ

విషపు కోరల హైందవ సైతాన్నీ

వట్టి చేతులతో తలపడతారు

 

గుక్కపెడుతున్న హృదయాలను

ఏడుపాపించి

వారి కోసం సువాసనల పూదోట వేస్తారు…

వేల గొంతులు మార్మోగు ఊరేగింపులో

ఉరికి ముందుకు పోతారు